బ్రేక్
అడవిలో అడ్డదారికి
యలమంచిలి రూరల్: ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌కు రాకపోకల కోసం ప్రభుత్వ, అటవీ భూముల మీదుగా అనుమతులు లేకుండా వేసిన రహదారిపై రాకపోకలు జరగకుండా అటవీ, జలవనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పెదపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం పొడవున అక్రమంగా రహదారి ఏర్పాటు చేసుకున్న విషయంపై ‘అడవిలో అడ్డదారి’ శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనం సంచలనం కలిగించింది. ఇంత అక్రమం జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై సాక్షిలో సమగ్రంగా వచ్చిన వార్త గత రెండ్రోజులుగా అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా అటవీ అధికారి రాజారావు ఆదేశాల మేరకు యలమంచిలి సబ్ డీఎఫ్‌వో సునీల్ ఆధ్వర్యంలో యలమంచిలి అటవీ పరిధి అధికారి జి.అనిల్‌కుమార్, అటవీ సెక్షన్ అధికారి వెంకటరమణ, సిబ్బంది సోమ, మంగళవారాల్లో అటవీ భూమి మీదుగా ఏర్పాటు చేసిన రహదారిని పరిశీలించి, రహదారిపై రాకపోకలు జరగకుండా పలుచోట్ల కందకాలు తవ్వించారు. ఇకపై అటవీ భూముల్లోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశించినా, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినా 1967 ఏపీ అటవీ చట్టం, 1972 వన్యప్రాణుల రక్షణ చట్టం, 2002 జీవ వైవిధ్య చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని, అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రధాన గేటుకు ఎదురుగా హెచ్చరిక బోర్డు సైతం పెట్టారు. జలవనరుల శాఖ అధికారులు కూడా శేషుగెడ్డ రిజర్వాయర్ గట్టుపై ఎలాంటి రహదారి నిర్మించకూడదని, దీనిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక జారీ చేశారు.
ఇదిలా ఉండగా అటవీ భూమిలో రహదారి వేసినందుకు ప్రాథమికంగా గుర్తించిన సమాచారం ప్రకారం ముగ్గురిపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఎఫ్‌ఎస్‌వో వెంకట రమణ సాక్షికి తెలిపారు. యలమంచిలి పట్టణానికి ఆనుకుని 16వ నెంబరు జాతీయ రహదారికి సమీపంలోనే రియల్ వెంచర్ ఉందని చెప్పడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో.. అటవీ భూముల్లో వేసిన రహదారిని తొలగించడంతో ఆందోళన మొదలైంది.
రియల్ ఎస్టేట్ వెంచర్‌కు వేసిన రహదారిపై రాకపోకలు బంద్
రహదారి తొలగించి, కందకాలు తవ్వించిన అటవీ అధికారులు
ముగ్గురిపై కేసు నమోదు.. ఇకపై అటవీ భూముల్లోకి ప్రవేశించే వారిపై కఠిన చర్యలు
బ్రేక్
బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment