జిల్లాలో 33 క్షయ రహిత పంచాయతీలు
సమావేశంలో మాట్లాడుతున్న క్షయ నివారణ జిల్లా అధికారి రామకృష్ణ
మాకవరపాలెం: జిల్లాలో 33 క్షయ రహిత పంచాయతీలను గుర్తించామని క్షయ నివారణ జిల్లా అధికారులు రామకృష్ణ, అయ్యప్ప తెలిపారు. స్థానిక పీహెచ్‌సీలో మంగళవారం వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షయ రహిత గ్రామాలే లక్ష్యంగా వైద్యశాఖ చర్యలు చేపట్టిందన్నారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో క్షయ వ్యాధి గుర్తింపు, నివారణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. వైద్య సిబ్బంది కూడా వ్యాధి నివారణపై ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాలో 33 క్షయ రహిత పంచాయతీలను ఎంపిక చేశామన్నారు. మాకవరపాలెం మండలం బూరుగుపాలెం పీహెచ్‌సీ పరిధిలో జి.గంగవరం, మాకవరపాలెం పీహెచ్‌సీ పరిధిలో జడ్.గంగవరం, బయ్యవరం, బి.ఎస్.పేట పంచాయతీలు వీటిలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు సీతారామలక్ష్మి, చరిష్మ, ఎంపీహెచ్‌ఈవో రమేష్, టీబీ సూపర్‌వైజర్లు మూలయ్య, చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్ సుధీర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment