పూడిమడక రోడ్డు విస్తరణ సర్వే పనులు వేగవంతం
● కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశం
పూడిమడక రోడ్డు విస్తరణ సర్వే పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్
మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణ సర్వే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. అనకాపల్లి జాతీయ రహదారి నుంచి అచ్యుతాపురం వరకు ఉన్న ప్రస్తుత రోడ్డును 100 అడుగుల మేర విస్తరించనున్న నేపథ్యంలో జరుగుతున్న ఫైనల్ సర్వే పనులను ఆమె మంగళవారం పలు శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. సర్వే పనులు వేగవంతం చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని విస్తరణకు సంబంధించి ఎటువంటి సమస్య రాకుండా చూడాలన్నారు. పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి బాధితులకు తగు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆర్డీవో ఆయిషా, ల్యాండ్ అండ్ రికార్డ్స్ విభాగం ఏడీ గోపాలకృష్ణ, ఆర్‌అండ్‌బీ, వీఎంఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment