ఈ పంచాయతీ ఈవో మాకొద్దు...
రావికమతం : కొత్తకోట మేజర్ పంచాయతీ ఈవో జ్యోతిరెడ్డి పంచాయతీ పాలనను గాలికి వదిలి అధికారి పార్టీ నాయకులు చెప్పినట్లు చేస్తున్నారని సర్పంచ్ లోవరాజు, ఉప సర్పంచ్ పందల దేవ, ఎంపీటీసీ సభ్యులు పూడి దేవ, పైల చిన్నమ్మలు, వార్డు మెంబర్లు ఆరోపించారు. మంగళవారం పంచాయతీ వద్ద విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీ పాలనా పరమైన సమస్యలపై ఈవో జ్యోతి నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారన్నారు. గ్రామానికి ఆదాయం సమకుర్చేందుకు సుమారు రూ.18 లక్షల నాబార్డు, పంచాయతీ నిధులతో మార్కెట్‌యార్డ్‌ను నిర్మించినా మార్కెట్ ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వలేదన్నారు. దేవాలయం వద్ద మాంసం, చేపలు విక్రయాలు చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. తక్షణమే ఆమైపె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమైపె జిల్లా కలెక్టర్, మండల అభివృద్ధికి ఫిర్యాదు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment