ఢిల్లీ దర్బారులో ఏటికొప్పాక బొమ్మ
●రాష్ట్రపతి భవన్‌లో లక్క బొమ్మల ప్రదర్శన
●హస్త కళాకారుడు పెదపాటి శరత్‌కు అరుదైన అవకాశం
యలమంచిలి రూరల్ : ఖండాంతర ఖ్యాతినార్జించిన ఏటికొప్పాక హస్తకళకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్రపతి భవన్‌లో ఏటికొప్పాక లక్కబొమ్మల ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. ఈ నెల 9 వరకు ఈ ప్రదర్శన ఉంటుందని హస్తకళాకారుడు పెదపాటి సత్యనారాయణ శరత్ ‘సాక్షి’కి తెలిపారు. ఇంతటి అరుదైన అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రదర్శన ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఏటికొప్పాక లక్కబొమ్మల ప్రత్యేకతను ప్రస్తావించారని పేర్కొన్నారు. ప్రముఖ గాయని మంగ్లీ గురువారం లక్కబొమ్మలను చూసి అబ్బురపడ్డారని తెలిపారు. గతంలో మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ మెప్పును పొందిన లక్కబొమ్మలు మరోసారి రాష్ట్రపతి ప్రశంసలు అందుకోవడం పట్ల ఏటికొప్పాక హస్తకళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సహజసిద్ధమైన రంగులతో కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటున్న లక్కబొమ్మలు చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే.
ఢిల్లీ దర్బారులో ఏటికొప్పాక బొమ్మ
Comments
Please login to add a commentAdd a comment