గొలుగొండ డిపోలో వెదురు అమ్మకాలు
● డిపో సందర్శించిన డీఎఫ్‌వో శ్యామ్యూల్
వేలం పాట నిర్వహిస్తున్న డీఎఫ్‌వో
గొలుగొండ : ప్రభుత్వానికి టేకు, వెదురు అమ్మకాల వల్ల ఆదాయం తీసుకురావడం జరుగుతుందని నర్సీపట్నం డీఎఫ్‌వో శ్యామ్యూల్ తెలిపారు. ఆయన గురువారం గొలుగొండ కలప డిపోను సందర్శించారు. ప్రతి నెల 6వ తేదీన గొలుగొండ కలప డిపోలో వెదురు, టేకు అమ్మకాలు జరుగుతున్న కారణంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం టేకు నిల్వలు తక్కువగా ఉన్నాయని, వెదురు అమ్మకాలు జరుగుతున్నట్లు చెప్పారు. గొలుగొండ కలప డిపో ద్వారా ప్రతి ఏటా రూ.కోట్లలో టేకు అమ్మకాలు జరుగుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం వెదురు నిల్వలు అమ్మకాలు జరుగుతున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో కృష్ణదేవిపేట, గొలుగొండ రేంజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment