పాడుతా తీయగా విజేత ధీరజ్‌కు సన్మానం
ధీరజ్‌ను సత్కరిస్తున్న ప్రముఖ వ్యాపారి నారాయణరావు కుటుంబ సభ్యులు
నర్సీపట్నం : పాడుతా తీయగా మహాసంగ్రామంలో తృతీయ బహుమతి సాధించిన నర్సీపట్నం వాసి దొంతంశెట్టి ధీరజ్‌ను ప్రముఖ వ్యాపారి వెలగా నారాయణరావు దంపతులు స్వగృహంలో గురువారం ఘనంగా సత్కరించారు. ధీరజ్ తల్లిదండ్రులను సన్మానించారు. ధీరజ్ పాటల మాధుర్యాన్ని పంచడంతో పాటు చిత్రకళ, ఫోటో గ్రఫీ, రచనల్లో కాకుండా అనేక భాషల్లో గాన గంధర్వుడని కొనియాడారు. రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని అకాంక్షించారు. సన్మానించిన వారిలో కంకటాల శిల్ప, వాసవీక్లబ్ జోన్‌చైర్మన్ పద్మనాభూని రాజేశ్వరి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment