బాలలతో పని చేయించడం నేరం
చీడికాడలో ఒక దుకాణం వద్ద పరిశీలిస్తున్న బాలల హక్కుల ప్రతినిధులు
చీడికాడ: బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్ములించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని జిల్లా బాలల హక్కుల పరిరక్షణ ప్రతినిధి డి.లోవరాజు అన్నారు. గురువారం మండల కేంద్రం చీడికాడలో పలు దుకాణాలను పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ బాలలను కార్మికులుగా పని చేయిస్తే చట్టప్రకారం శిక్షార్హులన్నారు. అనంతరం చీడికాడ పోలీసుస్టేషన్‌లో బాలికలతో సమావేశం నిర్వహించారు. బాలల హక్కులపై అవగాహన కల్పించారు. ఆయన వెంట ఏఎస్‌ఐ నాగేశ్వరరావు, హెచ్.సి రమణ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment