ఉపాధి పనులను పరిశీలించిన డ్వామా పీడీ
కూలీలతో మాట్లాడుతున్న దృశ్యం
చీడికాడ : ఎండలు తీవ్రత పెరగడంతో ఉపాధి పనులను ఉదయం 11 గంటలకు ముంగించాలని డ్వామా పీడీ ఆర్.పూర్ణిమదేవి సూచించారు. ఆమె గురువారం మండలంలోని కోనాం శివారు గుంటి గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఈ మేరకు ఆమె కూలీలతో మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 6 గంటలకు పనులు ప్రారంభించి 11 గంటలకు ముగించాలన్నారు. ప్రతి కుటుంబానికి 150 రోజులు పూర్తి చేయాలన్నారు. రోజువారి రూ.300 వేతనం వచ్చే విధంగా పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆమె వెంట ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీడీ శ్రీనివాస్, ఏపీవో గంగనాయుడు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment