విశాఖ విద్య: భారతీయ మహిళలు ఎంతో ధైర్యవంతులని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు ఎస్.విజయభారతి అన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో దుర్గాబాయి దేశముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, ఏబీఆర్‌ఎస్‌ఎం–లేడీ టీచర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం–2025 వర్క్‌షాప్ ఆక్సెలరేట్ యాక్షన్‌ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీ్త్ర విద్యతో సమాజాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. సంస్కారవంతమైన యువతకు తల్లిదండ్రులే కీలకమని చెప్పారు. సమాజం కోసం, దేశం కోసం అనే భావనతో యువత ముందుకెళ్లాలని సూచించారు. వివేకానందుడు కలలుగన్న విధంగా యువతరం ఉజ్వల తారలుగా మారి, తమ ఆశయాలను సాకారం చేసుకోవాలన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో మహిళల విజయగాథలను వివరించారు. కార్యక్రమంలో ఆచార్య ఎ.పల్లవి ఆంధ్రప్రదేశ్ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ పి.శ్రీదేవి, ఐఏఎస్‌ఈ ప్రిన్సిపాల్ ఆచార్య డి.నగరాజకుమారి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలు విజయభారతిని వైస్‌ఛాన్సలర్ ఆచార్య రాజశేఖర్, రిజిస్ట్రార్ ధనుంజయరావు జ్ఞాపిక అందించి, సత్కరించారు.
జాతీయ హక్కుల కమిషన్ సభ్యురాలు ఎస్.విజయభారతి
Comments
Please login to add a commentAdd a comment