ప్రజల మనిషిగా.. వారిలో ఒకరిగా..
నియోజకవర్గ కేంద్రం మాడుగుల సర్పంచ్‌గా ఎడ్ల కళావతి సేవా కార్యక్రమాల్లో ముందున్నారు. పోస్టుమాన్ కుమార్తె అయిన ఆమె సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ప్రజల కష్టసుఖాలు తెలుసు. ప్రతి రోజు ఉదయాన్నే గ్రామంలో తిరుగుతూ కొళాయిలు సక్రమంగా వస్తున్న దీ లేనిదీ పరిశీలిస్తుంటారు. లేకపోతే వెంటనే సరి చేయిస్తారు. పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షిస్తారు. పంచాయతీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారు. గత ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సహకారంతో ఇంటింటికీ కొళాయిలు, సీసీ రోడ్లు, ప్రధాన డ్రైనేజీలు, కోట్లాది రూపాయలతో శాశ్వత తాగునీటి పథకం నిర్మించి గ్రామాన్ని స్వర్గసీమగా మార్చారు.
– మాడుగుల
మాడుగుల మహిళా సర్పంచ్ సేవలు
Comments
Please login to add a commentAdd a comment