మాకవరపాలెం: రాయితీపై పశువులకు బీమా కల్పిస్తున్నట్టు పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి రామ్మోహన్‌రావు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పశువులకు 80 శాతం రాయితీతో బీమా అందిస్తున్నాయన్నారు. రెండేళ్ల కాలంలో 10,231 పశువులకు బీమా చేయగా, మృతి చెందిన 179 పశువులకు మంజూరైన రూ.52 లక్షల 98 వేల బీమా నగదును రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమంలో జిల్లాలో ఇప్పటి వరకు 90 వేల పశువులకు టీకాలు వేశామన్నారు. వర్షాకాలంలో పశువులకు అధికంగా సోకే గాలికుంటు వ్యాధిని నివారించేందుకు ఈ నెలాఖరు వరకు టీకాలు వేస్తున్నామన్నారు. జిల్లాలో 817 మినీ గోకులాలు మంజూరు చేయగా ఇప్పటివరకు 742 గోకులాల నిర్మాణం పూర్తయినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment