పెదఉప్పలంలో సర్వే టీం పర్యటన
ఎస్.రాయవరం: కేంద్ర ప్రభుత్వ పథకాలు సరిగా అమలవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు సర్వే టీం శుక్రవారం పెదఉప్పలం గ్రామంలో పర్యటించింది. నీతి ఆయోగ్ పంపిన బృందం సభ్యులు ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. . ఈ టీమ్‌కు సచివాలయ సిబ్బంది, ఇన్‌చార్జ్ ఎంపీడీవో సత్యనారాయణ తదితరులు సహాయ సహకారాలు అందించారు. కేంద్రం నుంచి వచ్చిన టీమ్‌లో ఫీల్డ్ మేనేజర్ వికాస్ మల్కర్, టీమ్ సూపర్‌వైజర్ సంధ్యారాణి, ఇన్వెస్టిగేటర్ భానుచందర్, లోకేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment