చోడవరం: స్థానిక ఆర్టీసీ కాంపెక్స్ సమీప కాలువలో గుర్తుతెలియని మృతదేహాన్ని చోడవరం పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మృతదేహం దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారెళ్లి మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీశారు. సుమారు 45–50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మగవ్యక్తిగా గుర్తించారు. నల్లరంగు పుల్‌ప్యాంట్, నల్లరంగు పుల్‌హ్యాండ్స్ నిలువు గీతలు కలిగిన చొక్కా శరీరంపై ఉన్నట్టు ఎస్‌ఐ నాగకార్తీక్ చెప్పారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేశామన్నారు. మృతుడి కుటుంబ సభ్యులుగానీ బంధువులుగానీ 9440796090, 9492952555 నంబర్లను సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment