కూటమి నాయకులకు సిగ్గుండాలి
చీడికాడ: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ప్రారంభమైన రోడ్డు నిర్మాణం ఇటీవల పూర్తయితే, కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పుకోవడానికి సిగ్గుండాలని అధికార పార్టీ నాయకులపై వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు, ఎంపీపీ కురచా జయమ్మ నారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చీడికాడ మండలం వి.బి.పేట నుంచి కొండేంపూడి, గొప్పూరు వరకు నిర్మించిన తారురోడ్డును శుక్రవారం వి.బి.పేట సర్పంచ్ వంటాకు సూర్యనారాయణ ఆధ్వర్యంలో కొండేంపూడి, గొప్పూరు, ముడిచర్ల, జైపురం గ్రామాల గిరిజనులతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ గతేడాది జనవరి 22న రూ.5.65 కోట్ల నాబార్డు నిధులతో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు శంకుస్థాపన చేసి రోడ్డు పనులు ప్రారంభించారన్నారు. అప్పటి నుంచి నిరంతరాయంగా పనులు జరిగి నేడు అందుబాటులోకి వచ్చిందన్నారు. దీన్ని కూటమి ప్రభుత్వమే చేసిందని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకోవడానికి సిగ్గుండాలన్నారు. సర్పంచ్ వంటాకు నర్సింహామూర్తి, గిరిజన గ్రామాల నేతలు కోట గంగరాజు, సింగారపు నాగరాజు, బోళెం రాము, సింగారపు ముసిలి, సొలం కొండబాబు తదితరులు మాట్లాడుతూ తమ గ్రామాలకు దారి లేక పోవడంతో మహానేత వైఎస్సార్ హయాంలో రూ.6 లక్షలతో మెటల్ రోడ్డు నిర్మించారని, తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఈ మెటల్ రోడ్డును తారురోడ్డుగా మార్చి తమ కష్టాలను తీర్చారన్నారు. వీరి రుణం తీర్చుకోలేనిదని కృతజ్ఞతలు తెలిపారు. సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు, శిరిజాం, ఖండివరం ఎంపీటీసీలు ఈర్లి దేవినాయుడు, గెంజి స్వామిబాలాజీ, వైస్ ఎంపీపీ ధర్మిశెట్టి స్వాతి కొండబాబు, పార్టీ నేతలు పోతల రమణ, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలోనేవి.బి.పేట–గొప్పూరు తారురోడ్డు నిర్మాణం
4 గ్రామాల గిరిజనులతో పార్టీ నేతల పరిశీలన
కూటమి నాయకులకు సిగ్గుండాలి
Comments
Please login to add a commentAdd a comment