నూకాంబిక అమ్మవారికి రూ.2 లక్షల విరాళం
నూకాంబిక అమ్మవారి ఆలయాభివృద్ధికి రూ.2 లక్షల విరాళం అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్
మునగపాక: మండలంలోని చూచుకొండలోని నూకాంబిక అమ్మవారి ఆలయాభివృద్ధికి తనవంతు సాయంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ శనివారం రూ.2 లక్షల విరాళం అందజేశారు. సర్పంచ్ దొడ్డి సూరప్పారావు, ఎంపీటీసీ కాండ్రేగుల కిరణ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ పెంటకోట అప్పలనాయుడు, పీఏసీఎస్ మాజీ పర్సన్ ఇన్‌చార్జి పెంటకోట హరేరామ, వైఎస్సార్‌సీపీ నేతలు గుంట్ల అప్పారావు, పిన్నమరాజు రవీంద్రరాజు, వ్యాపారవేత్త ఆడారి కృష్ణ, శంకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
22 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు
గొలుగొండ : కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అల్లూరి పార్కు వద్ద స్కూటీపై అక్రమంగా 22 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు కృష్ణదేవిపేట ఎస్‌ఐ తారకేశ్వర్రావు తెలిపారు. అనంతపూర్ జిల్లాకు చెందిన మనోహర్(22), గూడెం కొత్తవీదికి చెందిన వెంకటేష్ (32) స్కూటీపై 22 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. నిందితులిద్దపై కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నర్సీపట్నం : చెట్టుపల్లి–పాత లక్ష్మీపురం మధ్యలో శనివారం తెల్లవారి జరిగిన రోడ్డు ప్రమాదంలో అయ్యన్న కాలనీకి చెందిన పెదిరెడ్ల జగదీశ్వరరావు (36) మృతి చెందినట్టు రూరల్ ఎస్‌ఐ రాజారావు తెలిపారు. జగదీశ్వరరావుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వడ్డాది నుంచి తిరిగి వస్తుండగా తెల్లవారి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో జగదీశ్వరరావు మృతి చెందగా సతీష్, లోవరాజు గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment