రాజీమార్గమే రాజమార్గం
మాట్లాడుతున్న 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీవిద్య
అనకాపల్లి టౌన్: లోక్ అదాలత్‌లో రాజీమార్గమే రాజ మార్గమని, ఇక్కడి తీర్పే అంతిమమని 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. శ్రీవిద్య అన్నారు. స్థానిక కోర్టు ఆవరణలో శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో ఆమె మాట్లాడారు. ఈ అదాలత్‌లో 1101 కేసులు పరిష్కరించి, ఐదు కోట్ల ముప్‌పై రెండు లక్షల పదిహేడు వేల రెండు వందలు కక్షిదారులకు చెల్లించామన్నారు. నాలుగు బెంచ్‌లలో జరిగిన కార్యక్రమంలో సుమారు 650 మంది కక్షిదారులు పాల్గొని తమ కేసులను పరిష్కరించుకున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పి. నాగేశ్వరరావు, సీనియర్ డివిజన్ జడ్జి జి. రామకృష్ణ, సీనియర్ డివిజన్ అడిషనల్ సివిల్ జడ్జి బి.వి. విజయలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంజేవీఎన్ కుమార్, కార్యదర్శి బీఎన్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment