12న వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు
అనకాపల్లి టౌన్ : జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈనెల 12న ఘనంగా నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షడు, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా గ్రామీణ స్థాయి నుంచి వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు నియోజకవర్గ ప్రధాన కేంద్రాలు, మండల కేంద్రాలలో జెండా ఎగుర వేసి, అనంతరం నాయకులు, కార్యకర్తలు జిల్లా ప్రధాన కేంద్రంలో జరిగే వేడుకలకు విచ్చేస్తారని ఆయన తెలిపారు. అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ప్రజలను మోసం చేయడంపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని ఆయన కోరారు. తల్లికి వందనం, విద్యాదీవెన, రైతు భరోసా, మహిళలకు ఉచిన బస్, 50 ఏళ్లకే పింఛన్...ఇలా ఏ ఒక్క హామీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏ పథకానికీ నిధులు కేటాయించలేదని, దీనిని బట్టి హామీలన్నీ ఉత్తుత్తివే అని నిరూపణ అయిందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు కరణం ధర్మశ్రీ, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, కశింకోట ఆర్‌ఈసీఎస్ మాజీ చైర్మన్ మలసాల రమణారావు, జిల్లా కార్యదర్శి జాజుల రామేష్ పాల్గొన్నారు.
గ్రామీణ స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకూ పార్టీ జెండావిష్కరణలు
ఈ సందర్భంగా సూపర్ సిక్స్ హామీల అమలు కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం
పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు
Comments
Please login to add a commentAdd a comment