గడ్డి తిని బతకాలా..!
● ఉపాధి కూలీల వినూత్న నిరసన
గడ్డి చేత పట్టుకొని నిరసనకు దిగిన ఉపాధి కూలీలు
దేవరాపల్లి: ఉపాధి హామీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి కూలీలు వినూత్న నిరసన చేపట్టారు. గడ్డి చేత పట్టి, నోట్లో పెట్టుకొని తమ ఆవేదన వెలిబుచ్చారు. గర్సింగ్, డొర్రి చెరువు, మారేపల్లి గ్రామాలలో చేసిన కూలి పనుల బిల్లులు చెల్లించకపోతే గడ్డి తిని బతకాలా అని ప్రశ్నించారు. ఎండు గడ్డి చేత పట్టుకొని మంగళవారం వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. నాలుగు నుంచి ఎనిమిది వారాల వరకు ఉపాధి కూలీల సొమ్ము చెల్లించక పోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి.దొర మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment