యువత కోసం పోరు బాట
● నేడు విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన కలెక్టర్‌కు వినతిపత్రం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు
అనకాపల్లి: ఎన్నికల ముందు అలవి కాని హామీలు ఇచ్చి కూటమి నేతలు ప్రజలు నిలువునా ముంచేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. ఉద్యోగాలు రాక, నిరుద్యోగ భృతి ఇవ్వక యువత పడరాని పాట్లు పడుతున్నారని, వారి పక్షాన వైఎస్సార్‌సీపీ ‘యువత పోరు’ పేరిట నిరసన కార్యక్రమం చేపట్టిందన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 8 గంటలకు పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించాలని.. అనంతరం ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు అనకాపల్లి రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. అక్కడ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వరకు విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగులతో వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ప్రజలను నిలువునా ముంచేశారని, సూపర్ సిక్స్ పథకాలని ఆశ కల్పించి అధికారం చేజిక్కించుకున్నాక నరకం చూపిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ మాట్లాడారు. ఎంపీపీ గొర్లి సూరిబాబు, పార్టీ మండల అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, కశింకోట మండల అధ్యక్షుడు మలసాల కిషోర్, జిల్లా కార్యదర్శి జాజుల రమేష్, జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు పల్లెల వెంకట సీతమ్మదొర, 80వ వార్డు ఇన్‌చార్జ్ కె.ఎం.నాయుడు, జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరిపల్లి శోభ, తదితరులు పాల్గొన్నారు.
యువత కోసం పోరు బాట
Comments
Please login to add a commentAdd a comment