విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
కె.కోటపాడు : పిండ్రంగి గ్రామానికి చెందిన బి.స్వామినాయుడు(38) విద్యుత్ షాక్‌కు గురై మంగళవారం సాయింత్రం మృతిచెందాడు. తన ఇంటి నిర్మాణ పనులకు మేస్త్రి వద్ద స్వామినాయుడు సహాయంగా ఉన్నాడు. ఇంటికి సమీపం గుండా ఉన్న హెడ్‌డీ విద్యుత్ లైన్ వైరు ప్రమాదవశాత్తూ స్వామినాయుడు ఎడమ చేతికి తగులడంతో షాక్‌కు గురయ్యాడు. స్థానికులు వెంటనే అతన్ని ఆటోలో కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే స్వామినాయుడు మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ పోషణ చేసే భర్త మరణించడంతో తను, పిల్లలు అనాథలుగా మారామని భార్య లక్ష్మి రోధించడం చూపరులను కలచివేసింది. ఘటనపై లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎ.కోడూరు ఎస్‌ఐ లక్ష్మినారాయణ తెలిపారు. మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగిస్తామన్నారు.
మృతిచెందిన స్వామినాయుడు
Comments
Please login to add a commentAdd a comment