తాండవ గేట్ల మరమ్మతులు ప్రారంభం
తాండవ ప్రాజెక్టు ప్రధాన గేట్ల మరమ్మతు పనులు ప్రారంభిస్తున్న ప్రాజెక్టు డీఈ అనురాధ, చైర్మన్ సత్యనారాయణ
నాతవరం : తాండవ ప్రాజెక్టు ప్రధాన గేట్ల మరమ్మతులతోపాటు కాలువల అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు ప్రాజెక్టు డీఈ ఆనురాధ చెప్పారు. ఆమె మంగళవారం తాండవ ప్రాజెక్టు ప్రధాన గేట్ల లీకేజీలకు మరమ్మతు పనులను ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కె.సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. తాండవ ప్రాజెక్టు అభివృద్ధికి రూ.2 కోట్ల 10 లక్షలతో 18 పనులు చేపడుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం తాండవ కాలువలకు సంబంధించి మూడు పనులు జరుగుతున్నాయని, మిగతా పనులు త్వరలో చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జేఈలు శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment