సింహాద్రి ఎన్టీపీసీలో కలెక్టర్
ఎన్టీపీసీ సోలార్ విద్యుత్ ప్లాంట్‌లో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్
పరవాడ: అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం సింహాద్రి ఎన్టీపీసీని సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కంట్రోల్ రూమ్‌లోని మహిళా ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. ప్లాంట్‌లోని మోడల్ రూం పనితీరును తెలుసుకున్నారు. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను సందర్శించారు. సందర్శనలో భాగంగా పవర్ ప్లాంటు కార్యకలాపాలు, ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బొగ్గు రవాణా సేకరణ లింకేజీలు, షెడ్యూల్ ప్రక్రియపై చర్చలు జరిపారు. సమర్థవంతమైన ఇంధన ఉత్పత్తికి ఎన్టీపీసీ సింహాద్రి చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ వెంట సింహాద్రి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్‌శర్మ, ప్లాంట్ హెచ్‌ఆర్ బి.బి.పాత్ర, సీనియర్ అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment