పనులు జరుగుతున్న రోడ్డుకు మళ్లీ శంకుస్థాపన!
దేవరాపల్లి : ఇప్పటికే పనులు జరుగుతున్నా రహదారిపై మరలా టీడీపీ నాయకులు శంకుస్థాపన చేయడం పలు విమర్శలకు దారి తీసింది. చింతలపూడి పంచాయితీ శివారు బోడిగరువు, నేరెళ్లపూడి గ్రామాలకు వెళ్లే రహదారిలో బీటీ రోడ్డుకు నిధులు మంజూరయ్యాయని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణ మూర్తి కుమారుడు బండారు అప్పలనాయుడు మంగళవారం శంకుస్థాపన చేయడం వివాదాస్పదమైంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ లేకుండానే ఏ హోదాలో అతను రోడ్డుకు శంకుస్థాపన చేశారంటూ పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు లేకుండా శంకుస్థాపన చేయడం ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం స్థానిక సర్పంచ్, ఎంపీటీసలకు సైతం సమాచారం ఇవ్వకుండా చేయడంపై దుమారం రేగింది. దీనిపై అధికారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు.
నాడు బూడి చొరవతో రూ.2 కోట్లతో
మట్టిరోడ్డు నిర్మాణం
చింతలపూడి పంచాయతీ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న బోడిగరువు, నేరెళ్లపూడి గిరిజన గ్రామాలకు కనీసం కాలినడకన వెళ్లేందుకు కాలి బాట సైతం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. సుమారు 4కి.మీ మేర దూరంలో ఉన్న సమ్మెదకు చేరుకోవాలంటే కొండలు, గుట్టలు, గెడ్డలు, వాగులు దాటి ప్రాణాలకు తెగించి రాకపోకలు సాగిస్తూ నరకయాతన అనుభవించేవారు. 2023లో డిప్యూటీ సీఎం హోదాలో బూడి ముత్యాలనాయుడు 5 కి.మీ మేర కొండలు, గెడ్డలు, వాగులు దాటుకుంటూ ఆ రెండు గ్రామాలకు కాలినడకన చేరుకొని వారి కష్టాలను స్వయంగా చూశారు. సమ్మెద బ్రిడ్జి నుంచి బోడిగురువు మీదుగా నేరెళ్లపూడి వరకు రహదారి సౌకర్యం కల్పించేందుకు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేయించి, నిర్మాణ పనులు పూర్తి చేయించారు. ఆత ర్వాత బీటీ రోడ్డు నిర్మాణ పనులకు సైతం సంకల్పించారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పనులు కొనసాగించాల్సి ఉండగా మరలా శంకుస్థాపనల పేరిట ఇలా హడావుడి చేయడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి.
బోడిగరువు, నేరెళ్లపూడి రోడ్డుకు ఎమ్మెల్యే తనయుడు శంకుస్థాపన
ఎమ్మెల్యే కుమారుడు అప్పలనాయుడు తీరుపై సర్వత్రా విమర్శలు
అధికారులు, ప్రజాప్రతినిధులు లేకుండా ఏ హోదాలో చేశారని విస్మయం
పనులు జరుగుతున్న రోడ్డుకు మళ్లీ శంకుస్థాపన!
Comments
Please login to add a commentAdd a comment