అలరిస్తున్న విభిన్న వాతావరణం
ఖైదీకి ఫోన్ ఇచ్చిన భార్యాభర్తల అరెస్టు
ఆరిలోవ : విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీలకు ఫోన్ ఇచ్చిన భార్యాభర్తలను ఆదివారం అరెస్టు చేశారు. ఇటీవల జైలులో ఖైదీల వద్ద ఫోన్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం విచారణ కమిటీ వేయగా జైలులో ఫార్మసిస్ట్‌గా పనిచేసిన కడియం శ్రీనివాసరావు, అతని భార్య పుష్పలతలు నాగమల్లేశ్వరరావు అనే ముద్దాయికి ఫోన్ ఇచ్చినట్లు విచారణలో తేలింది. దీంతో విచారణ అధికారి, ఎస్‌ఐ కృష్ణ వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. గతంలో శ్రీనివాసరావు ఖైదీలకు గంజాయి సరఫరా చేయడంతో విధుల నుంచి తొలగించారు. ఖైదీలకు ఫోన్ అందించే ఘటనలో కూడా శ్రీనివాసరావు నిందితుడిగా నిర్ధారణ కావడం చర్చనీయాంశమైంది.
అనకాపల్లి టౌన్: అనకాపల్లి ప్రజలు అధిక మంచు, ఎండ తీవ్రత రెండింటిని చవి చూస్తున్నారు. పట్టణం, మండలంలో అధిక మంచు కురుస్తోంది. ఆదివారం ఉదయం ఏడు గంటలైనా మంచుతెరలు వీడలేదు. కనీసం వంద మీటర్ల దూరంలోని రోడ్డు కూడా సరిగ్గా కనిపించలేదు. దీంతో ప్రకృతి ప్రేమికులు మంచును ఆస్వాదిస్తూ దైనందిన కార్యక్రమాల్లో లీనమవుతున్నారు. కాస్త సమయం గడిచి తొమ్మిది గంటలయ్యేసరికి ఎండ ప్రతాపం చూపించింది. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సెలవు దినం కావడంతో ఎక్కువ శాతం ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. తప్పనిసరి పనులపై వచ్చేవారు ప్రత్యామ్నాయ మార్గాలతో ఉపశమనం పొందారు.
ఇంటర్ మూల్యాంకనం వేళల మార్పు
విశాఖ విద్య: ఇంటర్మీడియెట్ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, గణితం, సివిక్స్ సబ్జెక్టులకు సంబంధించి మూల్యాంకనం వేళలు మార్పు చేసినట్లు ఆర్‌ఐవో మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ వాల్యుయేషన్ కేంద్రమైన ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఈనెల 17, 18 తేదీల్లో ఉదయం ఇంటర్ ఒకేషనల్ పరీక్షలు ఉన్నందున మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూల్యాంకనానికి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
అలరిస్తున్న విభిన్న వాతావరణం
అలరిస్తున్న విభిన్న వాతావరణం
Comments
Please login to add a commentAdd a comment