ఘనంగా వీరాంజనేయస్వామి తీర్థం
మాడుగుల రూరల్ : ఎం.కోటపాడు, ఎం.కె.వల్లాపురం గ్రామ ఆరాధ్య దైవం వీరాంజనేయస్వామి తీర్థం మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బూడి ముత్యాలునాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనను మాడుగుల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శానాపతి కొండలరావు, ఎం.కె.వల్లాపురం ఉప సర్పంచ్ కరణం రాము, వల్లాపురం మాజీ సర్పంచ్ కోట్ని శ్రీరామ్మూర్తి, వాసవీక్లబ్ సభ్యుడు శ్రీనాదు రాజారావు శాలువ కప్పి సత్కరించారు. మధ్యాహ్నం ఎడ్ల పరుగు పోటీలు నిర్వహించారు. పీఏసీఎస్ కార్యాలయం వద్ద అన్నసమారాధన జరిపారు. సాయంత్రం మహిళల కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఎడ్ల బళ్ల పోటీల విజేతలు
ఎం.కోటపాడులో వీరాంజనేయ స్వామి తీర్థం సందర్భంగా మంగళవారం సాయంత్రం ఉత్తరాంధ్ర స్థాయి ఎడ్ల బళ్ల పోటీలు జరిగాయి. పోటీల్లో 15 జతల ఎడ్లు పాల్గొనగా అర్జునగిరికి చెందిన పరువాడ నాయుడు ఎడ్లకు ప్రథమ బహుమతి (రూ.15వేలు) దక్కింది. అలాగే ద్వితీయ బహమతి పైడితల్లమ్మ (లెక్కవానిపాలెం) రూ. 12వేలు, తృతీయ బహమతి కోలిపర్తి రామునాయుడు(కలగాడ) రూ.10వేలు, నాలుగో బహుమతి మరిడిమాంబ(వాయిల్పాడు) రూ.8వేలు, ఐదో స్థానంలో నిలిచిన బండారు చరణ్ హర్ష ఎడ్లు (కె.యల్.బి.పట్నం) రూ.6వేలు చొప్పున నగదు బహుమతులు పొందారు. అలాగే మొత్తంగా 11 స్థానాల్లో నిలిచిన వారికి వివిధ నగదు బహుమతులు అందించారు.
● ఉత్సాహంగా ఎడ్ల పరుగు పోటీలు
ఘనంగా వీరాంజనేయస్వామి తీర్థం
Comments
Please login to add a commentAdd a comment