ఆటోలో నగల బ్యాగ్ మరిచిపోయిన మహిళ
● నిజాయితీగా తిరిగి అప్పగించిన డ్రైవర్
పోలీసుల సమక్షంలో బాధితురాలికి అప్పగిస్తున్న డ్రైవర్
నక్కపల్లి : నక్కపల్లికి చెందిన ఓ మహిళ ఆటోలో మర్చిపోయిన బంగారం బ్యాగ్‌ను డ్రైవర్ నిజాయితీగా తిరిగి అప్పగించిన ఘటన మంగళవారం జరిగింది. సీఐ కుమారస్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నక్కపల్లికి చెందిన శిరీష అనే మహిళ తుని వెళ్లేందుకు నక్కపల్లిలో ఆటో ఎక్కింది. తనతో తీసుకెళ్తున్న బ్యాగ్‌ను ఆటోలో మర్చిపోయింది. ఆందులో సుమారు రూ.7లక్షలు విలువైన ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను ఉన్నాయి. దీంతో ఆమె నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌నో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేసేలోపు తునికి చెందిన ఆటోడ్రైవర్ గెడ్డమూరి అంజి నిజాయితీగా నక్కపల్లి మహిళ తన ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ ను, అందులో ఉన్న బంగారాన్ని నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వచ్చాడు. పోలీసుల సమక్షంలో బాధితురాలి ఇంటి వద్దకు తీసుకెళ్లి అందజేశాడు. డ్రైవర్ నిజాయితీకి మెచ్చి అతనికి కొంత నగదు ను కానుకగా అందజేశారు. సీఐ కుమార స్వామి ఆటోడ్రైవర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
28న తపాలా అదాలత్
మహారాణిపేట: విశాఖ పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 28న 117వ తపాలా అదాలత్ నిర్వహిస్తున్నారు. ఎంవీపీ కాలనీలోని పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయంలో ఈ అదాలత్ జరుగుతుందని తపాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.వి.డి.సాగర్ తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల పరిధిలోని తపాలా వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులను ఈనెల 24వ తేదీలోగా పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం, విశాఖపట్నం–530017 చిరునామాకు పంపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment