తాండవ కాలువల అభివృద్ధికి భూమిపూజ
నాతవరం: ఖరీఫ్ సీజన్‌లో తాండవ రిజర్వాయరు నీరు శివారు ఆయకట్టుకు అందించాలంటే కాలువలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తేనే సాధ్య పడుతుందని ప్రాజెక్టు డీఈ ఆనురాధ అన్నారు, తాండవ ఆయకట్టు పరిధిలో నాతవరం నర్సీపట్నం మండలాల మధ్య బలిఘట్టం మేజరు కాలువను అభివృద్ధికి రూ.11.70 లక్షలతో మంగళవారం భూమి పూజ చేశారు. ఆమె మాట్లాడుతూ తాండవ ఆయకట్టు పరిధిలో కాలువలు అభివృద్ధి చేసేందుకు 18పనులు రూ.2.10 కోట్లతో టెండర్లు ఖరారు చేశామన్నారు. వాటిలో ప్రస్తుతం కొన్ని పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. మిగతా పనులు కూడా త్వరలో ప్రారంభించి సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ జోగుబాబు, తాండవ ప్రాజెక్టు నాతవరం సెక్షన్ జేఈ శ్యామ్‌కుమార్, నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment