అంబేడ్కర్‌ను అవమానించిన వారిని శిక్షించాలి
రోలుగుంటలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న అంబేడ్కర్ యువజన సంఘ సభ్యులు
రోలుగుంట : తూర్పు గోదావరి జిల్లాలో అంబేడ్కర్ విగ్రహానికి చెప్పులతో దండవేసి అవమానించిన వారిని కఠినంగా శిక్షించాలంటూ అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి రోలుగుంటలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వారు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్రంలో ఎక్కడ అవమానం జరిగినా సహించబోమని అన్నారు.135 అడుగుల ఎత్తున అంబేడ్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేసి చట్టసభలో గౌరవిస్తున్నా ఇలాంటి హేయమైన సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సంఘ సభ్యులు తెలిపారు. బాధ్యులను అరెస్టు చేయకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే ప్రభుత్వానికి తిప్పలు తప్పవని హెచ్చరించారు.