
రైవాడలో భారీ గిరి నాగు కలకలం
దేవరాపల్లి: రైవాడలో శనివారం భారీ గిరి నాగు హల్‌చల్ చేసింది. గ్రామంలోని ఓ ఇంటీ సమీపంలోకి సుమారు 15 అడుగుల గిరి నాగు ప్రవేశించడంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు హడలెత్తిపోయారు. ఇళ్లల్లో నుండి ప్రాణ భయంతో బయట కు పరుగులు తీశారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ సుమారు గంటకు పైగా శ్రమించి అతి కష్టం మీద పట్టుకున్నారు. దీంతో స్థానిక ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం దేవరాపల్లి శివారు ఒడ్డు చింతల కల్లాల్లోని పంట పొలాల్లో భారీ గిరినాగు రైతులను బెంబేలెత్తించగా, తాజాగా రైవాడలో మరో గిరినాగు కనిపించడంతో ప్రజ లు భయాందోళనలు చెందుతున్నారు.