చిన్నారులకు ఆటపాటలతో నాణ్యమైన విద్య
● జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పీడీ అనంతలక్ష్మి ● కాశీపురంలో శిక్షణ తరగతుల సందర్శన
దేవరాపల్లి: పిల్లలకు పోషకాహారంతో పాటు ఆట పాటలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కె.అనంతలక్ష్మి అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. ఈ మేరకు మండలంలోని కాశీపురం హైస్కూల్లో జరుగుతున్న పోషణ్‌బి–పడాయిబి కార్యక్రమాన్ని బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో బోధించిన అంశాలను ఆకలింపు చేసుకొని అంగన్‌వాడీ కేంద్రాలలో అమలు చేయాలని సూచించారు. పోషణ్ ట్రాకర్‌లో లబ్ధిదారులతో తప్పనిసరిగా ఎఫ్‌ఆర్‌ఎస్ వేయించాలని ఆదేశించారు. స్థానిక ఐసీడీఎస్ సీడీపీవో మంగతాయారు, సూపర్‌వైజర్లు సుశీల, రాములమ్మ, ఆదిలక్ష్మి, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment