
అనకాపల్లిలో నీటి వృథా
అనకాపల్లి పట్టణ పరిధిలో సుమారు లక్ష మంది జనాభా నివసిస్తున్నారు. ఆరు పెద్ద వాటర్ ట్యాంకులు ఉన్నాయి. వీటి ద్వారా ఇంటింటికీ, వీధి కుళాయిల ద్వారా సుమారు 60 లక్షల లీటర్ల నీటి సరఫరా జరుగుతుంది. గతంలో ప్రజల అవసరాలకు తగ్గట్టు రెండు పూటలా సరఫరా చేసేవారు. వేసవి ప్రారంభమయ్యాక కొన్ని రోజులుగా ఉదయం 6.45 గంటల నుంచి 7.30 గంటల వరకు ముప్పావు గంట మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రజల దాహార్తిని తీర్చుకునేందుకు సరఫరా చేస్తున్న మంచినీరు సరిపోవటం లేదు. పట్టణంలో 420 చేతి బోర్లు ఉన్నాయి. కొన్నిచోట్ల వీధి కుళాయిలకు హెడ్స్ లేవు. దీంతో కుళాయిల నుంచి నీరు వృథాగా పోతుంది. అధికారులు వాటిపై దృష్టి సారించడం లేదు.