
మైనింగ్ మాఫియా పర్యావరణ విధ్వంసం
● రోలుగుంట మండలంలో 14 క్వారీల నిర్వహణలో అవకతవకలు
● ప్రజల భద్రత విషయంలో బాధ్యత లేదు
● రాత్రి సమయాల్లో టిప్పర్ల గోల
● చోద్యం చూస్తున్న ప్రభుత్వ శాఖలు
● తక్షణం చర్యలు తీసుకోండి
● కలెక్టర్‌కు జనసేన నేత పి.వి.ఎస్.ఎన్.రాజు వినతి –IIలో
పోలీస్ సిబ్బంది సమస్యలను తెలుసుకుంటున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయలో శుక్రవారం పోలీస్ గ్రీవెన్స్ జరిగింది. ఎస్పీ తుహిన్ సిన్హా జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఉద్యోగ, వ్యక్తిగత సమస్యలపై వినతులు స్వీకరించారు. పోలీస్ సిబ్బంది, హోంగార్డులు ఆరోగ్య, ఉద్యోగ, వ్యక్తిగత సమస్యలను ఎస్పీకి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు.
1న టెన్త్ సోషల్ పరీక్ష
అనకాపల్లి టౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 31న జరగాల్సిన పదో తరగతి సాంఘిక శాస్త్రం పబ్లిక్ పరీక్షను ఏప్రిల్ ఒకటవ తేదీకి వాయిదా వేశామని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు. రంజాన్ పర్వదినం ఈనెల 31న జరిగే అవకాశం ఉన్నందున పరీక్షను మంగళవారం నిర్వహిస్తున్నామని, ఈ మార్పును విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని ఆయన కోరారు.

మైనింగ్ మాఫియా పర్యావరణ విధ్వంసం