చోరీ సొత్తు రికవరీ
చోడవరం పోలీసు స్టేషన్‌లో రికవరీ చేసిన బంగారు నగలు చూపిస్తున్న ఎస్‌ఐలు జోగారావు, నాగకార్తీక్
చోడవరం : మండలంలో పి.ఎస్. పేట గ్రామానికి చెందిన కొల్లి లక్ష్మి తన ఇంట్లో ఉంచిన బంగారు వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని పోలీసులకు అమె బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌లు నాగకార్తీక్, జోగారావు గురువారం వివరాలు తెలిపారు. కొల్లి లక్ష్మి ఈ నెల 25 వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో ఇంటికి తాళాలు వేసి, పొలానికి వెళ్లింది. తిరిగి ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి తన ఇంట్లో ఉంచిన రెండు పేటలు బంగారు పుస్తులు తాడు(3 తులాలు), నల్లపూసల దండ (రెండున్నర తులాలు) అపహరణకు గురైనట్టు గుర్తించింది. దీనిపై లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోడవరం ఎస్‌ఐ నాగకార్తీక్ కేసు నమోదు చేశారు. సంఘటన స్థలానికి పోలీసు సిబ్బంది, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేస్తుండగా, ఈ చోరీ చేసిన వారు పోలీసులకు భయపడి, ఈ వస్తువులను తెచ్చి బాధితురాలి ఇంట్లో వేశారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment