హాకీ జాతీయ జట్టులో యలమంచిలి క్రీడాకారిణి
యలమంచిలి రూరల్: పట్టణానికి చెందిన లొట్ల మేరీ హాకీ మహిళల సీనియర్ జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఎంపిక ల్లో హాకీ ఇండియా సెలెక్టర్లు ఆమెను జాతీయ జట్టు ప్రోబబుల్స్ జాబితాలోకి ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 65 మంది ప్రతిభావంతులైన మహిళా క్రీడాకారులను ఎంపిక చేశా రు. వీరందరికీ ఈ నెల 23 నుంచి 30 వరకు బెంగళూరు ఎస్‌ఏఐ కేంద్రంలో తర్ఫీదునివ్వను న్నారు. శిక్షణ అనంతరం 40 మంది క్రీడాకారి ణులను తుది జట్టులోకి ఎంపిక చేస్తారు. హాకీ మహిళల జాతీయ ప్రోబబుల్స్ బృందంలో ఏపీ నుంచి యలమంచిలికి చెందిన లొట్ల మేరీ మాత్రమే చోటు దక్కించుకున్నారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డుకు చెందిన ద్విచక్రవాహనాల మెకానిక్ లొట్ల సంజీవి కుమార్తె మేరీ చిన్నప్పట్నుంచి హాకీలో విశేష ప్రతిభ కనబరుస్తూ వివిధ సందర్భాల్లో పతకాలు, బహుమతులు అందుకున్నారు. ఇదే క్రమంలో క్రీడల కోటాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖలో ఉద్యోగం కూడా సాధించారు. హాకీ జాతీయ జట్టు ప్రోబబుల్స్ జాబితాలో స్థానం పొందిన మేరీని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, యలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్ పిల్లా రమాకుమారి, అనకాపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి కొఠారు నరేష్, పలువురు సీనియర్ హాకీ క్రీడాకారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment