మట్టిలో మాణిక్యం
● గేట్‌లో మెరిసిన మర్రివలస విద్యార్థి ● తల్లిదండ్రులు రైతు కూలీలు
రావికమతం:
తల్లిదండ్రులు అమ్మిరెడ్డి కోటేశ్వరరావు, లక్ష్మి సామాన్య రైతు కూలీలు.. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు.. ఉన్నతాశయంతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు.. ఇప్పడు గేట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 12వ ర్యాంక్‌తో టాప్ లేపాడు.. ఇదీ మర్రివలస గ్రామానికి చెందిన అమ్మిరెడ్డి అశోక్ విజయ ప్రస్థానం. సామాన్య కుటుంబం నుంచి వచ్చినా మట్టిలో మాణిక్యంలా రాణించాడు. కొత్తకోట హైస్కూల్లో చదివి 10/10 సాధించడంతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది. ఇప్పుడు జాతీయ స్ధాయిలో నిర్వహించిన గేట్‌లో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో 863 మార్కులతో 12వ ర్యాంక్ సాధించాడు. పేద కుటుంబంలో పుట్టి జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించిన అశోక్‌ను గ్రామ సర్పంచ్ పాత్రుడు, ఎంపీటీసీ సభ్యుడు లోవరాజు, గ్రామ పెద్దలు, యువకులు, ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment