
ఎన్‌ఆర్‌ఐ మహిళలు.. స్వగ్రామంలో సేవలు
మాడుగుల : ఉన్న ఊరు... కన్నతల్లిని మరిచిపోకూడదని పెద్దలు చెప్పిన మాటలు మదిలో పెట్టుకుని తాము పుట్టిన గ్రామానికి సేవ చేయాలని తలచారు. ముగ్గురు మహిళా స్నేహితులు. విదేశాలకు వెళ్లిన ముగ్గురు ఎన్నారై మహిళలు తమ ఊరిపై మమకారంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఇక్కడి వసతి గృహాల్లో ఉండి చదువుతున్న బాలికలకు చేయూతనివ్వాలని నిశ్చయించుకున్నారు. గ్రామానికి చెందిన మహిళలు వాడపల్లి రత్న కుమారి, గడిమెల్ల రజని, అయ్యల బాల త్రిపుర సుందరి, జెర్రి వావణరెడ్డి ఉద్యోగ రీత్యా యుఎస్‌ఏలో ఉంటున్నారు. స్నేహితులైన వీరంతా కలిసి ప్రభుత్వ వసతి గృహాల్లో విద్య అభ్యసిస్తున్న పేద విద్యార్థినులకు నెలసరి సమయంలో వాడే కాటన్ పేడ్‌లతో పాటు ఇతర సామగ్రి ఉచితంగా అందజేస్తున్నారు. విశాఖకు చెందిన సంపూర్ణ సంస్థ ద్వారా నెలకు రూ.30 వేలు విలువ గల శానిటరీ కాటన్ ప్యాడ్స్ పంపిణీ చేస్తున్నారు. మాజీ ఎంపీపీ రామధర్మజ, సర్పంచ్ ఎడ్ల కళావతి, ఆద్వర్యంలో మాడుగుల బీసీ బాలికల వసతి గృహాన్ని దత్తత తీసుకుని వితరణ అందజేశారు. వారిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.
నిరుపేద బాలిక విద్యకు ప్రోత్సాహం
స్ఫూర్తినిస్తున్న స్నేహితురాళ్లు

ఎన్‌ఆర్‌ఐ మహిళలు.. స్వగ్రామంలో సేవలు

ఎన్‌ఆర్‌ఐ మహిళలు.. స్వగ్రామంలో సేవలు
Comments
Please login to add a commentAdd a comment