
టెన్త్ విద్యార్థిని అదృశ్యంపై ఫిర్యాదు
రావికమతం: జెడ్.కొత్తపట్నం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని బొబ్బిలి సాయి సంజన (16) అదృశ్యంపై తండ్రి బొబ్బిలి రాజు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్టు కొత్తకోట ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. సాయి సంజన (16) జెడ్.కొత్తపట్నం హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. కొత్తకోట హైస్కూల్లో పబ్లిక్ పరీక్షలు రాసింది. ఈ నెల 1వ తేదీన (మంగళవారం) చివరి పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. అయితే మంగళవారం రాత్రి నుంచి ఆమె కనిపించకపోవడంతో స్నేహితులను, బంధువులను ఆరా తీశారు. ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.