
పాత కోర్టు భవనం పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
పాత కోర్టు పరిసరాలను పరిశీలిస్తున్న ఉమ్మడి విశాఖ జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు
అనకాపల్లి టౌన్: పట్టణంలోని పాత కోర్టు భవనాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు శనివారం పరిశీలించారు. అనకాపల్లి కోర్టు ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న నేపథ్యంలో బార్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు వచ్చిన ఆయన పాత కోర్టు భవనాన్ని వాడుకలోకి తీసుకురావచ్చా లేదా అన్నది పరిశీలించారు. ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో మాట్లాడి తదుపరి నిర్ణయాన్ని తెలుపతామన్నారు. 10వ అదనపు జిల్లా జడ్జి వి.నరేష్, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి విజయలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుమార్, కార్యదర్శి దుర్గారావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.