తాడిపత్రి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసి రెండో సారి జగన్ సర్కార్‌ను ఏర్పాటు చేయడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య అన్నారు. తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి కాలనీలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024లో జరిగే ఎన్నికలు, ఫలితాలపై టైమ్స్ నౌ చేపట్టిన ప్రీ పోల్స్ సర్వే విశ్లేషణ మూడు రోజులు క్రితం విడుదలైందని గుర్తు చేశారు.
పైలా నరసింహయ్య
ఇందులో 25 ఎంపీ స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంటుందని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ లెక్కన అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కై వసం చేసుకోవడం ఖాయమన్నారు. తెలుగు దొంగల పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు, జన్మభూమి కమిటీలు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, అమరావతి రాజధాని నిర్మాణం వంటి వాటిల్లో అంతులేని అవినీతికి పాల్పడ్డాడన్నారు. ఈ అక్రమాలు బహిర్గతం కావడంతో ప్రజలు ఏవగించుకుంటున్నారన్నారు.
తాము అధికారంలోకి తీసుకువస్తే రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారో చెప్పే పరిస్థితిలో లేని తండ్రీకొడుకులు... రాష్ట్రంలో అలజడులు సృష్టించి లబ్ధి పొందాలనుకుంటున్నారని లోకేష్, చంద్రబాబుపై మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ‘మా భవిష్యత్తు నువ్వే జగన్’ కార్యక్రమంలో భాగంగా గృహసారథులు, వలంటీర్లు గడపగడపకూ వెళుతుంటే ప్రజలు ఆదరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment