లోపాలను వెంటనే సరిచేయండి
గుత్తి: పాఠశాల సముదాయాల పునర్ వ్యవస్థీకరణ విధానంలో అనేక లోపాలు ఉన్నాయని వాటిని వెంటనే సవరించాలని వైఎస్సార్‌టీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. గుత్తిలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓబులేసు, వెంకటరెడ్డి మాట్లాడారు. పాఠశాల నుంచి మరో పాఠశాలకు వెళ్లాలంటే 25 నుంచి 30 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తుందన్నారు. దీంతో రెండు , మూడు వాహనాలు మారాల్సి వస్తుందన్నారు. పాఠశాల సముదాయానికి వెళ్లాలంటే ఆత్రుతలో ఉపాధ్యాయులు ప్రమాదాలకు గురయ్యే అవకాశ ఉందన్నారు. ఇవే కాకుండా అనేక సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం లోపాలు సరిచేయాలని డిమాండ్ చేశారు.
ఆమిద్యాలలో భారీ చోరీ
● 20 తులాల బంగారు, రూ.1.50 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
ఉరవకొండ: మండల పరిధిలోని ఆమిద్యాల గ్రామంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు ఇంట్లో బీరువాలోని 20 తులాల బంగారుతో పాటు రూ1.50 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. ఆమిద్యాలకు చెందిన దర్జీ నారాయణరావు, సర్వసతీ దంపతులు 10 రోజుల క్రితం వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెంగళూరుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువా ధ్వంసం చేసి 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.1.50 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జనార్దన్‌నాయుడు కేసు నమోదు చేసుకొని క్లూస్‌టీం సహాయంతో వేలిముద్రలను సేకరించారు.
కారు బోల్తా ..
వ్యక్తికి గాయాలు
చెన్నేకొత్తపల్లి: అనంతపురం వైపు నుంచి బెంగళూరుకు వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి గాయపడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన మైకేల్ ఫెర్నాడెజ్ మరో వ్యక్తితో కలసి అనంతపురము వైపు నుంచి బెంగళూరుకు కారులో వెళుతున్నారు. అయితే మండల పరిధిలోని ఉన్న ఫారెస్ట్ నర్సరీ వద్దకు రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న మైకేల్ ఫెర్నాడెజ్ గాయపడగా చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. అక్కడి నుంచి అతను చికిత్స నిమిత్తం బెంగళూరు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
లోపాలను వెంటనే సరిచేయండి
Comments
Please login to add a commentAdd a comment