ప్రభుత్వానికి కనువిప్పు కల్గిస్తాం
అనంతపురం కార్పొరేషన్: ఉపాధి కూలీల పొట్ట కొడుతున్న ప్రభుత్వానికి కనువిప్పు కల్గించేలా వైఎస్సార్‌సీపీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఉపాధి కూలీల విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయాలి. ఇందులో భాగంగానే ఈ నెల 17న కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్నామని వైఎస్సార్‌సీపీ పంచాయితీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం ఉపాధి హామీ పనుల్లో 50 శాతం కూలీలకు ఉపాధి చూపించాలన్న నిబంధనను కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.69 లక్షల పనిదినాలు కల్పించలేదని, అందుకు సంబంధించి రూ.700 కోట్ల నిధులు టీడీపీ నాయకుల ఖాతాల్లోకి వెళ్లాయని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మంత్రి వర్గంలో ఆయన ర్యాంక్ ఎక్కడో చెప్పాలన్నారు. మీ స్థానాన్ని పదో స్థానంలోకి పడేసిన సీఎం చంద్రబాబు వైఖరిపై మీ నిర్ణయం ఏమిటో తెలియజేయాలన్నారు. పంచాయితీరాజ్ శాఖకు మంత్రిగా ఉన్న పవన్‌కళ్యాణ్ ఉపాధి కూలీలకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉపాధి కూలీలకు కలెక్టర్ న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస
Comments
Please login to add a commentAdd a comment