కుంభమేళాకు వెళ్లిన తాడిపత్రి వాసులకు గాయాలు
తాడిపత్రిటౌన్: పట్టణం నుంచి కుంభమేళాకు వెళ్లిన తాడిపత్రి వాసులు ఆదివారం ప్రమాదానికి గురయ్యారు. తాడిపత్రి నుంచి కుంభమేళాకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో దాదాపు 40 మంది వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కాశీకి దాదాపు 30 కిలో మీటర్‌ల దూరంలో వారి బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొంది. దీంతో దాదాపు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కడప రోడ్డులో ఉన్న శివాలయం నిర్వాహకుడు రంగస్వామి, బాలరంగయ్య దంపతులకు గాయాలైనట్లు తెలిసింది. క్షతగాత్రులను వారణాసి కలెక్టర్, ప్రజాప్రతినిధులు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment