మహిళలకు రక్షణ కరువు
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో మహిళలు, విద్యార్థినులకు రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖ్ యాదవ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ధ్వజమెత్తారు. ఇటీవల అన్నమయ్య జిల్లాలో యువతిపై హత్యాయత్నం, అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటనలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సోమవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినుల బాత్రూమ్‌లో బిహార్ యువకులు తొంగిచూసిన ఘటన కూటమి మంత్రి వర్గానికి కన్పించలేదా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌గా పరిగణించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు అండగా నిలుస్తామన్న పవన్ కళ్యాణ్ పూజలకే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. బాలికల వసతి గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నగరాధ్యక్షురాలు సాకే చంద్రలేఖ, విద్యార్థి విభాగం నాయకులు భారతి, నరేష్, మహేశ్వరి, శేఖర్, భాను, అనిత, చందు, రాజేష్, సూర్య, రమేష్, అరుణ్‌యాదవ్, కరుణాకర్, శివ, శశికళ, పాల్గొన్నారు.
● వైఎస్సార్‌సీపీ అనుబంధ సంఘాల నేతల ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment