సకాలంలో పరిష్కారం చూపాలి
అనంతపురం: మహిళల ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి సకాలంలో పరిష్కారం చూపాలని ఎస్పీ పి.జగదీష్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’లో ఎస్పీ 80 అర్జీలు స్వీకరించారు. సమస్యలను పరిశీలించి అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ డీవీ రమణమూర్తి, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ ఎస్‌ఈగా శేషాద్రి శేఖర్
అనంతపురం టౌన్: విద్యుత్ శాఖ ఎస్‌ఈగా శేషాద్రి శేఖర్‌ను నియమిస్తూ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కళ్యాణదుర్గం ఈఈగా పనిచేస్తున్న శేషాద్రిశేఖర్‌కు ఎస్‌ఈగా పదోన్నతి కల్పించారు. దీంతో సాయంత్రమే ఆయన ఎస్‌ఈగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఈ సంపత్ కుమార్‌ను కార్పొరేట్ కార్యాలయంలో సీజీఎంగా బదిలీ చేశారు.
సకాలంలో పరిష్కారం చూపాలి
Comments
Please login to add a commentAdd a comment