మాముడూరులో ఇరువర్గాల ఘర్షణ
గుత్తి రూరల్: మాముడూరులో గొర్రె పిల్లలను ఉంచే జాలరీ విషయంలో సోమవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వరలక్ష్మి, అనిల్‌కుమార్‌లకు తమ ఇంటి సమీపంలో ఉండే రవి, చౌడప్ప, ఎల్లప్ప, రామాంజనేయులు, పెద్దయ్యలతో గత కొన్ని నెలలుగా భూమి విషయంలో వివాదం ఉంది. పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలో గ్రామ శివారులో గొర్రె పిల్లలను ఉంచే జాలరీల ఏర్పాటు విషయంలో వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. దాడిలో అనీల్‌కుమార్, తల్లి వరలక్ష్మి గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
శతాధిక వృద్ధుడు కన్నుమూత
రాయదుర్గంటౌన్: పట్టణానికి చెందిన మున్సిపల్ విశ్రాంత ఉద్యోగి ఎస్.అమీరుద్దీన్‌సాబ్ (104) అనారోగ్యంతో సోమవారం ఉదయం 6.30 గంటలకు చనిపోయారు. ఈయన భార్య 40 ఏళ్ల క్రితమే మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గుకు కుమార్తెలు ఉన్నారు. సాయంత్రం బళ్లారి రోడ్డులోని ఖబర్‌స్థాన్‌లో అంత్యక్రియలు నిర్వహించినట్లు కుమారుడు మెహబూబ్‌బాషా తెలిపారు.
విద్యుత్ తీగలు తగిలి
15 గొర్రెలు మృతి
శెట్టూరు: విద్యుత్ తీగలు తెగి మందపై పడటంతో అందులో 15 గొర్రెలు మృతి చెందిన సంఘటన మల్లేటిపురంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కురుబ గోవిందప్ప సుమారు 100 గొర్రెలతో తన పొలంలేనే మంద ఏర్పాటు చేసుకున్నాడు. ఆదివారం రాత్రి మంద వద్దే నిద్రించాడు. గొర్రెల మంద నిద్రిస్తున్న స్థలం వద్దే విద్యుత్ మెయిన్‌లైన్ ఉంది. సోమవారం ఉదయం తెల్లవారుజామున మూడుగంట సమయంలో విద్యుత్‌తీగ తెగి గొర్రెల మందపై పడింది. మెరుపుతో కూడిన శబ్దం రావడంతో రైతు ఉలిక్కిపడి లేచాడు. రైతు వెంటనే లైన్‌మెన్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. విద్యుత్‌షాక్‌కు గురికాంకుండా జాగ్రతపడి గొర్రెలను మందనుంచి బయటకి తీశాడు. అయితే అప్పటకే 15 గొర్రెలు మృతి చెందాయి. విద్యుత్ వైర్లు పాతబడటం వల్లే తెగిపోయాయని గ్రామస్తులు తెలిపారు. సర్పంచ్ వెంకటేశులు, ఎంపీటీసీ ప్రహ్ల్దా, వైఎస్సార్‌సీపీ నాయకులు కిష్టప్ప, సిద్దలిగంప్ప, గ్రామస్తులు రైతును పరామర్శించారు.
వివాహితపై అత్యాచారయత్నం
తాడిపత్రి రూరల్: బొడాయిపల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన ఓ వివాహితపై బంధువైన అంకన్న అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాధితురాలు ఇంట్లో జరిగిన విషయం తెలిపింది. సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడు అంకన్నపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ కాటమయ్య తెలిపారు.
మాముడూరులో ఇరువర్గాల ఘర్షణ
మాముడూరులో ఇరువర్గాల ఘర్షణ
మాముడూరులో ఇరువర్గాల ఘర్షణ
Comments
Please login to add a commentAdd a comment