ఉరవకొండ: వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. మంగళవారం ఉరవకొండ పీఎస్‌లో ఏర్పాఉట చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్‌ఐ జనార్దననాయుడు వెల్లడించారు. స్థానిక కుమ్మర వీధిలో నివాసముంటున్న కిషోర్‌కుమార్ (39), దాసరి కేదార్‌నాథ్, కమ్మరి హరికృష్ణ, మరో ఇద్దరు స్నేహితులు. ముగ్గురూ కొంత కాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడేవారు. ఈ క్రమంలో రూ.9 లక్షల వరకూ నష్టపోయారు. దీంతో కిషోర్‌కుమార్ ప్రమేయం వల్లనే తాము నష్టపోయామని, ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పొగొట్టుకున్న డబ్బు మొత్తాన్ని చెల్లించాల్సిందేనంటూ కొంత కాలంగా నలుగురు స్నేహితులూ తీవ్ర ఒత్తిడి చేశారు. ఈ క్రమంలోనే ఇంటి వద్ద గొడవ చేసి మాటలతో హింసించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిషోర్‌కుమార్ ఈ నెల 8న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం ఉరవకొండ శివారున కేదార్‌నాథ్, హరికృష్ణను అరెస్ట్ చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment