యువకుడి ఆత్మహత్య
కణేకల్లు: మండలంలోని 43 ఉడేగోళం గ్రామానికి చెందిన బోయ ఈశ్వర్ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... నిరుపేద కుటుంబానికి చెందిన ఈశ్వర్‌కి రెండేళ్ల క్రితం డి.హిరేహళ్ మండలం పులకుర్తి గ్రామానికి చెందిన కావేరితో వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. కూలీ పనులతో కుటుంబాన్ని పోషించుకునే ఈశ్వర్ కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. తాగుడు మానేయమని భార్య పలుమార్లు ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్థాపం చెందిన ఆమె కుమారుడిని పిలుచుకుని మంగళవారం సాయంత్రం తన పుట్టింటికెళ్లింది. దీంతో అత్తింటి వారు మందలిస్తారేమోననే అనుమానంతో మంగళవారం రాత్రి 7.30 గంటలకు తాము నివాసముంటున్న గుడిసెలోనే ఈశ్వర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారి సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment