జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించిన ‘గురుకుల’ విద్యా
బుక్కరాయసముద్రం: ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు మహారాష్ట్రలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బీకేఎస్ మండలం కొర్రపాడులో ఉన్న ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. లాంగ్‌జంప్ పోటీల్లో 8వ తరగతి విద్యార్థి ఇందు, 6వ తరగతి విద్యార్థి నవ్యశ్రీ వెండి పతకాలు సాధించారు. ప్రతిభ చాటిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ శ్యామలాదేవి, పీఈటీలు వరలక్ష్మి , తేజస్విని, హేమ, శ్యామలమ్మ అభినందించారు.
కాలువలో పడి విద్యార్థి మృతి
గుమ్మఘట్ట: ప్రమాదవశాత్తు సాగునీటి కాలువలోని నీటి ప్రవాహంలో పడి ఓ విద్యార్థి మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు... బేలోడుకు చెందిన అన్నపూర్ణకు 11 సంవత్సరాల క్రితం గలగల గ్రామానికి చెందిన లోకేష్‌తో వివాహమైంది. అనారోగ్యంతో 2020లో అన్నపూర్త మృతి చెందింది. అప్పటి నుంచి వారి కుమారుడు జాని పోషణను అమ్మమ్మ హనుమక్క, తాత హనుమప్ప తీసుకున్నారు. ప్రస్తుతం జాని (7) బేలోడులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన జాని.. మధా్‌య్‌హ్నం తోటి స్నేహితుడు లక్కీతో కలసి గ్రామ సమీపంలోని బీటీపీ సాగునీటి కాలువ వద్దకెళ్లాడు. అప్పటికే సిద్దంగా ఉంచుకున్న గాలాన్ని తీసి కాలువలో వేసే క్రమంలో జాని ప్రమాదవశాత్తు అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. ఆ సమయంలో లక్కీ కేకలు విన్న చుట్టుపక్కల పొలాల్లోని రైతులు అక్కడకు చేరుకుని జానీని వెలికి తీశారు. అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడిని వెంటనే రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళితే.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
చికోటి ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు
గుంతకల్లు టౌన్: ధర్మరక్ష వ్యవస్థాపకుడు, తెలంగాణ బీజేపీ నేత చికోటి ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం గుంతకల్లు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పొట్టిశ్రీరాములు సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సభనుద్దేశించి చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. మత ప్రబోధకుల్లో 90 శాతం మంది సరిగా లేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ నినదిస్తే హైదరాబాద్‌లోని ఒవైసీతో పాటు ఇతరులకు వణుకు పుట్టాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ప్రతిచోటా హిందుత్వానికి శత్రువులు ఎక్కువయ్యారని, సెక్యులర్ వాదులను తాను శిఖండీలుగా అభివర్ణిస్తున్నానని అన్నారు.
జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించిన ‘గురుకుల’ విద్యా
జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించిన ‘గురుకుల’ విద్యా
Comments
Please login to add a commentAdd a comment