ఎస్‌ఈ సంపత్ బదిలీ అశాసీ్త్రయం
● మాజీ మంత్రి సాకే శైలజానాథ్
అనంతపురం కార్పొరేషన్: ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ) సంతప్‌కుమార్ బదిలీ పూర్తి అశాసీ్త్రయంగా ఉందని, వెంటనే ఈ బదిలీని ఆపాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన సంపత్‌కుమార్ విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించేవారన్నారు. ఎలాంటి తప్పుడు ఆరోపణలు లేకున్నా కొందరి ప్రయోజనాల కోసం ఆయనను బదిలీ చేయడం సరికాదన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని కూటమి ప్రభుత్వం పదే పదే చెబుతున్నా.. ఆచరణలో కనీసం కనుచూపు మేరలోనూ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. సంపత్ కుమార్ విషయంలో ఉన్నతాధికారుల తీరును తప్పుబట్టారు.
యూట్యూబ్ చానల్ నిర్వాహకుడి మృతదేహం లభ్యం
గుంతకల్లు రూరల్: కనిపించకుండా పోయిన యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు 24 గంటలు గడవక ముందే హంద్రీనీవా కాలువలో మృతదేహమై తేలాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లుకు చెందిన యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు తిరుమలరెడ్డి (45) గత ఆదివారం బుగ్గ సంగాల క్షేత్రం సమీపంలో అదృశ్యమైన విషయం తెలిసిందే. కాగా, ఆయన మృతదేహం గుంతకల్లు–మద్దికెర మార్గంలోని హంద్రీ–నీవా ప్రధాన కాలువలో సోమవారం కొట్టుకువచ్చింది. తల, ముఖం, కాళ్లపై ఉన్న గాయాలను బట్టి తిరుమలరెడ్డి హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, తిరుమలరెడ్డి అదృశ్యమైన ప్రాంతంలో దెబ్బతిన్న ఆయన బైక్ తప్ప ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. హతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, వ్యక్తుల పేర్లను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ అనుమానితుడిని ఇప్పటికే తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. తిరుమలరెడ్డి హత్యకు గురైనట్లు తెలిసిన వెంటనే వైఎస్సార్‌సీపీ నేత మంజునాథరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రికి చేరుకుని తిరుమలరెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. హతుడి భార్య, కుమార్తె, కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు.
రైతు ఆత్మహత్య
యల్లనూరు: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... యల్లనూరు మండలం పెద్దమల్లేపల్లి గ్రామానికి చెందిన రైతు ఆంధ్ర శ్రీనివాసుల నాయుడు (62) భార్య పదేళ్ల క్రితమే మృతిచెందింది. అప్పటి నుంచి తన కుమారుడితో కలసి ఆయన ఉంటున్నాడు. కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. అయితే వ్యాధి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న శ్రీనివాసుల నాయుడు సోమవారం రాత్రి తన పాత ఇంట్లో నిల్వ చేసిన పురుగుల మందు తాగాడు. కాసేపటి తర్వాత తన స్నేహితుడు సద్దల చంద్రమౌళీశ్వరరెడ్డి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. వెంటనే స్పందించిన ఆయన, శ్రీనివాసులు నాయుడు కుమారుడు మధుసూదన్‌నాయుడు, బంధువులతో కలసి పాత ఇంటి వద్దకు చేరుకున్నారు. అపస్మారక స్థితికి చేరుకున్న శ్రీనివాసుల నాయుడిని తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. మధుసూదన్‌నాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment